Tuesday, September 19, 2023

కేసీఆర్ అర్బ‌న్ పార్కులో చిరుత‌.. వీడియో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

హ‌రిత‌హారంతో గ్రీన‌రీ పెర‌గ‌డంతో ఈ అద్భుత‌దృశ్యం క‌నిపించింద‌ని ఓ వీడియోని ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్. సీఎం కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారం అద్భుత ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని సంతోష్ కుమార్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అప్ప‌న‌ప‌ల్లిలోని కేసీఆర్ అర్బ‌న్ పార్కు గోల్ బంగ్లా వాచ్ ట‌వ‌ర్ ద‌గ్గ‌ర చిరుత పులి క‌నిపించ‌గా, ఆ వీడియోను ఎంపీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. . తెలంగాణ అంత‌టా ప‌చ్చ‌ద‌నం పెంచాల‌నే సీఎం కేసీఆర్ సంక‌ల్పానికి వంద‌నాలు అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement