Friday, April 26, 2024

Hanumakonda : అమ‌రుల‌కి నివాళుల‌ర్పించిన‌.. చీఫ్ విప్ వినయ్ భాస్కర్

హనుమకొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు హనుమకొండ జిల్లాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక చదివారు. హనుమకొండ జిల్లా అన్ని రంగాలలో ముందుకు సాగుతుంద‌ని అన్నారు. అమరుల త్యాగం వల్లనే తెలంగాణ సాకారం అయిందని, వారి కలలను నేడు తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి. రంగనాథ్, కుడా చైర్మన్ సుదర్ రాజ్ యాదవ్, అదనపు కలెక్టర్ సంద్యారాణి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకోని తన క్యాంపు కార్యాలయంలో జండా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర సాధనకై అమరులైన వారికి అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించి తదనంతరం కాళోజీ నారాయణరావు గారు ,ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాల వద్ద ఘన నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement