Friday, December 2, 2022

టీఆర్ఎస్ అభ్య‌ర్థి కోటిరెడ్డిని గెలిపించాలన్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

ఈనెల 10వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డిని గెలిపించాలని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ…. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్ సీఐ గోదాముల్లో ఉందన్నారు.

- Advertisement -
   

కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ఇక, ధాన్యం సేకరణ పై కేంద్రం స్పష్టమైన ప్రకటన పార్లమెంట్‌లో చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారు సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేసిన ఆయన.. స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement