Thursday, April 25, 2024

గద్వాల్ లో భగ్గుమన్న పాత కక్షలు.. వ్యక్తిని నరికేసిన ప్రత్యర్థులు

జోగులాంబ గద్వాల జిల్లా పాత కక్షలు భగ్గుమన్నాయి. పూడూరులో ఒకరినొకరు గోడ్డలతో ఘర్షణ దిగారు. ప్రత్యర్థులులో ఒక వ్యక్తి హత్యకు గురికాగా మరో  వ్యక్తికి తీవ్ర గాయాల పాలయ్యాడు.  గద్వాల మండలం పూడూరు గ్రామంలో దొడ్లు (గుడిసెల) విషయంలో ఒకరిని ఒకరు దాడులు చేసుకున్నారు. పూడూరు గ్రామానికి ఆనుకొని  6.1/2 ఎకరాల భూమి రాజుల వంశీయులకు చెందింది.  భూమి కొందరు పట్టాలు కూడా  చేసుకున్నారు. అయితే, ఆ భూమిలో ఇదే గ్రామానికి చెందిన 63 మందికి కళ్ళం దొడ్లు వేసుకోమని రాజు వంశీకులు అప్పట్లో ఇచ్చారు. అంతకు ముందే అక్రమంగా పట్టాల కొందరు పొంది  ఉండడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కోర్టు కూడా బాధితులకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ రోజు తెల్లవారుజామున గుడిసెలు వేసుకునేందుకు 63 మంది గ్రామంలోని భూమి దగ్గరికి వచ్చారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న అక్రమ పట్టాదారులు మారణాయుధాలతో  వీరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు దాడికి చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  సమాచారం అందుకున్న  పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఘటనలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement