Thursday, April 25, 2024

ప్రాజెక్ట్ ల విజిట్ లో జీఆర్ఎంబీ… తెలంగాణ అభ్యంతరం.. ఎందుకు…

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల సందర్శనను పూర్తి చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) తాజాగా ఖమ్మం జిల్లాలోని శ్రీ సీతారామ ఎత్తి పోతల పనులను కూడా పరిశీలించేందుకు సన్నద్ధ మవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు అనుమతి లేకుండా గోదావరి బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అనుమతి లేకుండా జీఆర్‌ఎంబీ సాగునీటి ప్రాజెక్టులను సందర్శించడంతోపాటు హ్యాండింగ్‌ ఓవర్‌ నోట్‌ సిద్ధంచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. సబ్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకే ప్రాజెక్టుల సందర్శనను కొనసాగించాలని జీఆర్‌ఎంబీకి స్పష్టం చేసింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే సాగునీటిని అందించే ప్రాజెక్టులను కూడా జీఆర్‌ఎంబీ సందర్శించాలని నిర్ణయించడం సబబు కాదని స్పష్టం తెలంగాణ స్పష్టం చేస్తోంది. శ్రీ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమని, ఈ ప్రాజెక్టుతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.

మరోవైపు సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌… ఆమోదం కోసం కేంద్ర జలశక్తి శాఖ వద్ద ఉందని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను సందర్శించాలని జీఆర్‌ఎంబీ నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకానికి తెలం గాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగు తున్నాయి. ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా లోన్‌ను సమకూర్చుకునేందుకు ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగురంగ ముఖ చిత్రాన్ని ఈ ప్రాజెక్టు మార్చివేయపనుందని తెలంగాణ సర్కారు భావిస్తోంది. గోదావరి నదీలోనుంచి దుమ్ముగూడెం పాయింట్‌ ద్వారా నీటిని ఎత్తిపోసేలా సీతారామ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. సత్తుపల్లి, ఇల్లందు, పాలేరు రిజర్వాయర్లను కూడా సీతారామ ఎత్తిపోతల నీటి ద్వారా నింపనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement