Saturday, April 20, 2024

ఘనంగా ‘గాయత్రి’ వార్షికోత్సవం.. విద్యార్థుల డ్యాన్స్​ ప్రోగ్రామ్స్​ అదుర్స్​

పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ మరియు పి.జి కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు స్వరూప ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కాంపిటీటివ్ పరీక్షలకు కసిద్ధం కావాలన్నారు. ముఖ్య అతిధులుగా డాక్టర్​ హరికాంత్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఎస్.యూ మరియు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్ధుల డ్యాన్స్​లు పలువురిని అలరించారు. యూనివర్సిటీ స్థాయి క్రీడలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, డిగ్రీ సేమిస్టర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు బహుమతులు అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement