Saturday, January 28, 2023

మానేరు వాగులో తాతా-మనవడు గల్లంతు.. మనవడు మృతి

మానేరు వాగు దాటుతుండగా తాతా-మనవడు గల్లంతైన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్ల్లి లో చోటు చేసుకుంది. మీర్జంపేట గ్రామానికి చెందిన మార్క దేవేందర్ తన మనవడితో కలిసి మానేరు వాగు దాటుతుండగా గల్లంతయ్యారు. వాగు ఒడ్డున ఉన్న రైతుల అరుపులతో గాలింపు ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత అశ్వంత్ మృతదేహాన్ని వెలికితీశారు. దేవేందర్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement