Thursday, April 25, 2024

తెలుగు అకాడమీలో గోల్ మాల్.. పాత్రధారులు ఎవరు?

తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌ మాల్‌ పై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఇందులో ఇంటర్‌బోర్డు కార్యదర్శి, బోర్డులోని అకౌంట్స్‌ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడులను సభ్యులుగా ఉన్నారు. ఈ గోల్ మాల్ వ్యవహారంపై అక్టోబరు 2వ తేదీలోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, అకాడమీ పలు విడతలుగా యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయగా అందులో గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు ఎంతమంది? అకాడమీ డైరెక్టర్‌ సంతకాలను ఫోర్జరీ చేశారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన దుర్గార్ములు..

Advertisement

తాజా వార్తలు

Advertisement