Friday, October 4, 2024

Good News – ద‌స‌రాకు ముందే డిఎస్ సి నియమాకాలు …రేవంత్

.

హైద‌రాబాద్ – రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1:3 ప్రాతిప‌దిక‌న ఫ‌లితాలు విడుద‌ల చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశామ‌ని, జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 2,46,584 మంది హాజరు అయ్యారని తెలిపారు. 66 రోజుల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడంలో పేద ప్రజల పట్ల మా చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు. విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేశార‌ని, వారి అంద‌రినీ సీఎం అభినందించారు.

9లోగా నియామాకాలు
ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తామ‌ని సీఎం చెప్పారు. అక్టోబ‌ర్ తొమ్మిదో తేది లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అంద‌జేస్తామ‌న్నారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారని చెప్పారు. బీఆర్ ఎస్‌ పదేళ్లలో ఏడు వేల టీచర్ పోస్టులే భర్తీ చేశారని, అతి తక్కువ టైంలో 11 వేల 62 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

త్వ‌ర‌లో గ్రూప్‌-1 ఫ‌లితాల వెల్ల‌డి
గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీజీపీస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారు. గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. తీవ్రమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం గ్రూప్ 1,2,3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిందని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement