Friday, June 2, 2023

ఫారెన్ పోతున్నా.. మీరంతా జ‌ర పైలంగా ఉండుర్రి: కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఇంజనీర్, సోష‌ల్ యాక్టివిస్ట్, లీడ‌ర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి తాను విదేశీ పర్యటనకు పోతున్న‌ట్టు తెలిపారు. ఈ రోజు త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తో కూడిన ఫొటోను షేర్​ చేశారు.

’’నేను అబ్రాడ్ వెళ్తున్నా.. అమెరికా వెళ్లి చాలా రోజులైంది. మ‌ళ్లీ మూడు వారాల త‌ర్వాత తిరిగొస్తా.. మీరు, మీ కుటుంబ స‌భ్యులు జాగ్రత్తగా ఉండండి.. అట్లాగే రాష్ట్రాన్ని కూడా కాస్త జాగ్ర‌త్త‌గా చూసుకోండి..‘‘ అని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి తన ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement