Tuesday, September 17, 2024

Makthal – శోభాయమానంగా గణేషుడు శోభాయాత్ర

మక్తల్ , సెప్టెంబర్ 7(ప్రభన్యూస్)వినాయక చవితి పర్వదిన వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో వైభవంగా జరిగాయి. విఘ్నాలను తొలగించే విజ్ఞాధిపతి విజ్ఞేశ్వరుడిని పట్టణంలోని వివిధ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రతిష్టించారు. ముందుగా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం సీతారామ కళ్యాణ మండపం కిష్కిందాదాపురి నుండి విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆజాద్ నగర్ లోని విశ్వకర్మ నివాసం వరకు నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.

.విశ్వకర్మ ఇంటి వద్ద తోడు గణపతులకు పూజలు నిర్వహించిన అనంతరం ఆయా వినాయక మండపాల నిర్వాకులు గణపతులను తలపై మోస్తూ భాజా భజంతులతో ఊరేగింపుగా తమ మండపాలకు వెళ్లి ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య ,మాజీ జడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, బిజెపి నాయకులు కర్ని స్వామి ,బి .ఆంజనేయులు సూర్య , సి. చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్, బోయ రవికుమార్ ,కావలి తాయప్ప, గోవర్ధన్ తెదేపా నాయకులు మధుసూదన్ రెడ్డి విహెచ్పి బజరంగ్దళ్ నాయకులు కావాలి వెంకటేష్, వి. భీమ్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement