Friday, April 19, 2024

ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు వెలకట్టలేనివి : మంత్రి గంగుల

కరీంనగర్ ప్ర‌భ‌న్యూస్ : కరోనా రోగులకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అందించిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కొత్తపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ టీకా ముందు జాగ్రత్త ( బూస్టర్) డోసులను సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసుకు అర్హులు అని తెలిపారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడి ఉన్నవారికి బూస్టర్ డోస్ అందిస్తున్నామని వివరించారు.

ఎలాంటి వ్యాధులు లేని 60 ఎండ్లు పై బడిన వారికి వచ్చే నెల నుంచి ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, డిప్యూటీ డీఎంహెచ్ ఓ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, పీ ఎచ్సీ వైద్యులు రమేష్, వంశీ, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement