Wednesday, April 17, 2024

బీసీ స్టడీ సర్కిల్ లో ఫ్రీ కోచింగ్.. దరఖాస్తులకు 27వరకు చాన్స్..

ప్ర‌భ‌న్యూస్: బిసి స్టడి సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్స్‌ 2022 పరీక్ష ఇవ్వనున్న ఉచిత శిక్షణకు దరఖాస్తు తేదీని ఈనెల 27 వరకు పొడగించినట్లు బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ నామోజు బాలాచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. సివిల్స్‌ పరీక్ష రాయాలని ఆసక్తి ఉన్న అర్హులైన బిసి యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా విద్యార్ధులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తామని ఆయన తెలిపారు.

సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హత గల యువత ఈనెల 27 తేదీలోగా http://tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్‌ 040-24071178 కు ఫోన్‌ చేసి సంప్రదించాలని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement