Thursday, November 7, 2024

Secunderabad – ఫోర్త్‌ రిచెస్ట్ రైల్వే స్టేష‌న్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూఢిల్లీ : ప్రతి ఏటా రైల్వేస్టేషన్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ప్రకటిస్తుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఆదాయం పొందిన వంద‌ రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్ కు రెండో స్థానం ద‌క్కింది. చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ మూడో స్థానంలో ఉంది.

దీంతో దేశంలో నాలుగో రిచెస్ట్ రైల్వే స్టేష‌న్‌గా సికింద్రాబాద్ గుర్తింపు పొందింది.

ఆదాయం ఇలా ఉంది

- Advertisement -

ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఏటా భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తోంది. హౌరా రైల్వే స్టేషన్ కు రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం రాగా చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్లు వచ్చాయి. తెలంగాణ‌లో ఉన్న‌ సికింద్రాబాద్ స్టేషన్ రూ. 1,276 కోట్లు సంపాందించి నాలుగో స్థానంలో ఉంది.

అలాగే 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్లేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో 28 రైల్వే స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి. ప్ర‌యాణికుల సంఖ్య‌ ప‌రంగా థానే (మ‌హారాష్ట్ర‌

ప్రయాణికుల సంఖ్య పరంగా పరిశీలిస్తే ముంబైలోని థానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణించారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడు ఇక్కడి నుంచి 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు.

న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ కూడా ఈ జాబితాలో చోటు సాధించింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరువాత ఎన్ఎస్‌జీ 1 హోదా విజయవాడ (ఆంధ‌ప్ర‌దేశ్‌) మాత్రమే సాధించింది.

ఈ గుర్తింపుతో కేంద్రం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనుంది. అలాగే.. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు

.2023–24 లో రైల్వేశా ప్రకటించిన ఆదాయం వివరాలున్యూఢిల్లీ …. రూ. 3,337 కోట్లు హౌరా ( వెస్ట్ బెంగాల్)… రూ. 1,692 కోట్లు. చెన్నై సెంట్రల్(తమిళనాడు)…రూ. 1,299కోట్లు, సికింద్రాబాద్( తెలంగాణ)..రూ. 1,276 కోట్లు, హజరత్ నిజాముద్దీన్( ఢిల్లీ).. రూ. 1,227 కోట్లు. లోకమాన్య తిలక్ టెర్నినల్(ముంబై).. రూ. 1,036 కోట్లు. అహ్మదాబాద్ ( గుజరాత్) ..రూ. 1,010 కోట్లు, ముంబై సీఎస్టీ (మహారాష్ట్ర) ..రూ. 982 కోట్లు

ప్రయాణికుల పరంగా …న్యూఢిల్లీ …. 39,362, 272 మంది హౌరా ( వెస్ట్ బెంగాల్)… 61,329,319 మంది చెన్నై సెంట్రల్(తమిళనాడు)…30,599,837 మంది. సికింద్రాబాద్( తెలంగాణ). 27,776,937 మంది హజరత్ నిజాముద్దీన్( ఢిల్లీ).. 14,537,686 మంది లోకమాన్య తిలక్ టెర్నినల్(ముంబై)..14,680,379 మంది, అహ్మదాబాద్ ( గుజరాత్) .. 18,260,021 మంది ముంబై సీఎస్టీ (మహారాష్ట్ర) ..51, 652,230 మంది

Advertisement

తాజా వార్తలు

Advertisement