Wednesday, March 22, 2023

బిఆర్ఎస్ స‌ర్వేలో న‌లుగురు మంత్రులు,22 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రధాన ప్రతినిధి: మంత్రులు, శాసన సభ్యుల పనితీరు ప్రజల్లో వారికున్న విశ్వాసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సంస్థలతో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ప్రతి మూడు మాసాలకొకసారి రాష్ట్రంలోని పార్టీ ఎమ్మె ల్యేల పనితీరుపై నిఘావర్గాలతో పాటు- ఆయా సంస్థ లతో సర్వే నిర్వహించి అందులో వచ్చిన ఫలితాల ఆధా రంగా శాసనసభ్యుల పనితీరును మార్చుకోవాలని స్వయంగా సీఎం కేసీఆర్‌, భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ- రామారావులు వారిని పిలిచి దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుతుం టారు. సాధారణంగా ప్రతి ఏటా నాలుగు దఫాలు, కొన్ని సమయాల్లో రెండు నెలలకొకసారి వివిధ ఏజెన్సీల ద్వారా సర్వే రూపంలో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని స్వయంగా సీఎం కేసీఆరే రూపొందించి ఇస్తారన్నది పార్టీలో ప్రచారం ఉంది. అయితే ఈ ఏడాది చివరిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వీలుగా జనవరి నుంచి ఫిబ్రవరి 5వ తేదీవరకు ఈ సర్వే నిర్వహించగా వాటి ఫలితాలు రెండు రోజుల క్రితం సీఎంకు చేరినట్టు- సమాచారం.

- Advertisement -
   

25 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని స్వయంగా కేసీఆర్‌ రూపొందించి ఇచ్చినట్టు- సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుతో పాటు- కుటు-ంబ సభ్యుల పాత్ర, వారి వ్యాపారాలు, ప్రజల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్ర తదితర అంశాలు ఇందులో చేర్చినట్టు- సమాచారం.
అధికార పార్టీ భారాసకు చెందిన నలుగురు మంత్రు లతో పాటు- 22 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు- సర్వే ఫలితాలు వెల్లడించినట్టు- సమాచారం. ఈ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ప్రజలకు ఎంత మాత్రం అందుబాటు-లో ఉండడం లేదని హైదరాబాద్‌ కేంద్రంగా వారు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ వారం పదిరోజుల కొకసారి నియోజక వర్గానికి వస్తున్నట్టు- స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు- సమాచారం. తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది. ఎమ్మెల్యేల్లో అరడజను మంది ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనుకంజలో ఉన్నట్టు- ఆ సర్వే ఫలితాలు వెల్లడించినట్టు- అత్యంత విస్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల్లో వచ్చిన ఫలితాల ప్రకారం ఎమ్మెల్యేలను పిలిచి చివరిసారిగా హెచ్చరి కలు జారీ చేయాలని మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరిపే తాజా సమాచార సేకరణలో ఫలితాలు ఈ తరహాలో వస్తే ఎన్నికల్లో టికెట్లను నిరాకరించాలని కూడా కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావడంతో టికెట్ల కేటాయింపులో గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా అత్యంత కఠినాతి కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి భారాస అధినేత కేసీఆర్‌ వచ్చినట్టు- సమాచారం. సిట్టింగ్‌ ఎమ్యెల్యేలందరికీ మళ్ళీ పోటీ- చేసే అవకాశం ఇస్తామంటే ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడం కాదని, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లకుండా కాలయాపన చేయడం ప్రజలకు దూర ంగా ఉండడం కాదని భారాస అగ్రనేత ఒకరు వ్యాఖ్యా నించారు.

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం కేసీఆర్‌ వారిని ఉపేక్షిస్తూ వచ్చారని, ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో ఇలా ఎన్నో జరిగాయని గుర్తు చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలతో సాన్నిహితంగా ఉండాలని ప్రతి సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవడం లేదని, దీంతో పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పలచన అవుతోందని కీలక నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, వారి వ్యూహం ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న సమాచారం సర్వేల సందర్భంగా బయటపడినట్టు- తెలుస్తోంది. గ్రామీణ, ఆవాస ప్రాంతాలకు చివరికి చెంచు గిరిజన గూడేలకు వెళ్లి సమాచారాన్ని సేకరించి నట్టు- చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, లబ్ధిదారుల అభిప్రాయాలు కూడా సేకరించగా వారినుంచి మంచి స్పందన వచ్చినట్టు- సమాచారం. నియోజకవర్గాల్లో పర్యట నలకు సంబంధించి కూడా పూర్తి సమాచారం తెప్పించినట్టు- ప్రచారం జరుగుతోంది. సమాచార నివేదిక ఫలితాలను అధ్య యనం చేశాకే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై కేసీఆర్‌ ఒక అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు అంటు-న్నాయి. ఈనెల 26న మహారాష్ట్రలో నిర్వహి స్తున్న భారాస రెండవ బహిరంగ సభ తర్వాత సర్వే ఫ లితాల్లో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు పిలిపించి సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సర్వేల్లో వచ్చిన సమాచారాన్ని వాళ్ళ ముందుంచి తలంటు-తారని సమాచారం.
కాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో నల్గొండ జిల్లాలో ఉన్న నలుగురిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు-తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ముగ్గురు, వరంగల్‌లో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో నలుగురు, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇద్దరేసి, మెదక్‌లో ఇద్దరు, హైదరాబాద్‌ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు ఉన్నట్టు- సమా చారం. ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పనితీరు కూడా ఏ మాత్రం సంతృప్తిగా లేదని ఆ నివేదిక తేల్చినట్టు- ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement