Saturday, March 25, 2023

e-Racing | హైద‌రాబాద్‌లో మళ్లీ ఫార్ములా ఈ-రేసింగ్‌ సందడి.. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : భాగ్యనగరంలో మరోసారి రేసింగ్‌ తో కార్లు సందడి చేయనున్నాయి. నగరం నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఫిబ్రవరిలో మళ్లీ ఫార్ములా ఈ రేస్‌ షురూ కాబోతుంది. వచ్చే నెల 11న ఈ రేసింగ్‌ ప్రారంభంకానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తేదీన ప్రాక్టీస్‌ రేసింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రక టించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన టికెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. టికెట్ల విడుదల కార్యక్రమానికి ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -
   

టాప్‌ 25 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ ను నిలిపేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. మొత్తం ఫార్ములా ఈ రేసింగ్‌ లో 11 దేశాల నుంచి 22 మంది డ్రైవర్లు పోటీ పడనున్నట్లు పేర్కొన్నారు. రేసింగ్‌ చూసేందుకు వచ్చే వారు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. రూ. 1,000 నుంచి 10,000 వరకు టికెట్లు అందుబాటులో ఉంచారు. రూ. 1,000 గ్రాండ్‌ స్టాండ్‌, రూ.3,500 ఛార్జ్‌ గ్రాండ్‌ స్టాండ్‌, రూ.6000కు ప్రీమియం గ్రాండ్‌ స్టాండ్‌, రూ. 10,000 ఏస్‌ గ్రాండ్‌ స్టాండ్‌ టికెట్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement