Friday, March 29, 2024

Telangana: బీజేపీకి బిగ్​ షాక్​.. టీఆర్​ఎస్​లోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి దాకా ఆ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులు, పద్మశాలీలు ఉన్న నేపథ్యంలో ప్రముఖ పద్మశాలీల నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

2012-18 మధ్య రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభకు ఎన్నిక కాక ముందు ఆనంద భాస్కర్ జర్నలిస్టుగా పని చేశారు. చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీలో చేరారు. మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాపోలు ఆనంద్‌ భాస్కర్‌.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనుండటం ఆసక్తికర పరిణామం.చేనేత రంగానికి సీఎం కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

2012-18 మధ్య రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని పేర్కొన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరతానని సీఎం కేసీఆర్‌తో చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద్‌ భాస్కర్‌ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement