Saturday, October 12, 2024

ఫారెస్ట్ అధికారి ద్విచక్ర వాహనం దగ్ధం.. ఫారెస్ట్ స‌మీపంలో చెకింగ్ వెళ్ల‌గా ఘ‌ట‌న‌

ఖమ్మం (ప్రభన్యూస్): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట శివారులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్య‌క్తులు తగులబెట్టారు. అడవిలో వేటగాళ్లు జంతువుల కోసం కరెంటు వైర్లు బిగిస్తున్నారనే సమాచారంతో అటవీ అధికారి కాళీ బయలుదేరారు. అటవీ సమీపంలోని వరి పొలంలో ద్విచక్ర వాహనం పార్క్ చేసి నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లగానే అతని ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు.

సమీప రైతులు, ఫారెస్ట్ అధికారి ఫోన్ చేసి తెలియ‌జేయ‌టంతో సంఘటనా స్థలానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ లోపే వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు ఘటన మరవక ముందే మరో ఘటన జరగటంతో అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement