Saturday, November 27, 2021

పొన్నాల వద్ద ప్లై ఓవర్.. యాక్సిడెంట్లు తగ్గించేందుకు చర్యలు..

ప్ర‌భ‌న్యూస్: సిద్దిపేట పొన్నాల వద్ద నిర్మించ బోయే ప్లై ఓవర్ నిర్మాణ పనులు పై అధికారులతో కల్సి మంత్రి హరీష్ రావు పర్యవేక్షణ చేశారు.. కరీంనగర్ నుండి హైదరాబాద్ , సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో పొన్నాల వద్ద ప్రమాదాలు అరికట్టేందుకు ఈ ప్లై ఓవర్ నిర్మిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట ప్రజలు హైదరాబాద్ కు వెళ్లేందుకు వీలుగా పొన్నాల జంక్షన్ వద్ద ప్రమాదాలు అరికెట్టేలా ప్లై ఓవర్ నిర్మాణ పనులపై పలు సూచనలు చేశారు. పనులు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు జరిగే సమయంలో ప్రజల ప్రయాణానికి ఎలాంటి అసౌకర్యాలు కలుగొద్దని చెప్పారు. ప్రమాదాలు జరిగకుండా చర్యలు చెప్పటాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News