Monday, October 7, 2024

Accident – ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం … ఐదుగురు దుర్మరణం

ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లాగుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బైoసా నుండి పికప్ వాహనంలో ఆదిలాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మ్యాక్స్ వాహనం సైడ్ పిల్లర్ల ను ఢీకొట్టి దూసుకెళ్లడం తో ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదు గురి మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

*మృతులు ఆదిలాబాద్ వాసులే*.

. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా అదిలాబాద్ పట్టణం టీచర్స్ కాలనీ వారుగా గుర్తించారు.మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12) గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.భైంసా లో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement