Friday, June 2, 2023

కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే.. ఇంటికొచ్చి కొడతా – ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

వైరా :దేశంలో రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపట్టిన జూడో యాత్రకు విశేష స్పందన లభిస్తుందనిఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అన్నారు. ఆదివారం రాత్రి హత్ సే హత్ జూడో యాత్ర కార్యక్రమంలో భాగంగా వైరాలో రామ్మూర్తి నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. మూడు రంగుల జెండాలో గాంధీ కుటుంబ రక్తం ఉందని, ఆయనను జైలుకు పంపితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశంలో ఉన్న సంపదనంతా అంబానీ, ఆదాని కుటుంబాలకు కట్టబెడుతూ ఇదేమని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై అనర్హత వేటివేయటం ప్రజల గమనిస్తున్నారన్నారు. ప్రధాని మోడీకి దేశ ప్రజలే తగిన శిక్ష వేస్తారని అన్నారు. దేశంలో గతంలో కుల, మతాలు ఘతీతంగా ప్రజలు స్నేహభావంతో ఉన్నారని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలు పెంచుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారని అన్నారు.

- Advertisement -
   

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటానని చెబుతూనే గతంలో రైతులకు బేడీలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుట్టలను జెసిబిలతో అక్రమంగా లాక్కొని పేదవాడు పోట్ట కొడుతున్నాడని ఆరోపించారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేయించుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, ఆ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని, రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో 10 సీట్లు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఇంటికి వచ్చి కొడతానని హెచ్చరించారు. నా చేతికి ఉన్నది గాజులు కాదు అని, విష్ణుచక్రాలని గుర్తించుకోవాలన్నారు. టిపిసిసి సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, ధరావత్ రామ్మూర్తి నాయక్, కట్ల రంగారావు , ఎడవల్లి కృష్ణ, సూరంపల్లి రామారావు, పగడాల మంజుల, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement