Friday, December 2, 2022

Fire Accident: సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఐసోలేషన్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భయంతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షాట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement