Thursday, March 30, 2023

నిర్మాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సెక్రటేరియట్ చుట్టుపక్కల రోడ్లు బ్లాక్ చేసినారు ఎవర్ని రానివ్వటం లేదు. అయితే.. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా.. సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement