Monday, October 14, 2024

Financial White Paper బడ్జెట్ బారెడు – వచ్చింది మూరెడు

అర్థిక శ్వేత పత్రం విడుదల

ఆగస్ట్ నెల వరకు లెక్కల్ని కాగ్ పంపిన ప్రభుత్వం

రూ.2,21,242 కోట్ల రెవెన్యూ అంచనా

ఇప్పటి వరకు వచ్చింది రూ.61,618కోట్లు

- Advertisement -

హైదరాబాద్ – తాము అధికారంలోకి వచ్చే సమయానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు వారసత్వంగా ఇచ్చి వెల్లిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యం లో రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేసింది. ఎన్నికల హామీల అమలు వేళ..తెలంగాణ ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ భారంగా మారుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాగ్ కు ఆదాయ, వ్యయ వివరాలను సమర్పించింది.ప్రభుత్వ నివేదికతెలంగాణ ప్రభుత్వానికి ఆగస్టు నెలలో పన్ను ఆదాయం పెరిగింది. ప్రభుత్వం కాగ్ కు సమర్పించిన నివేదిక లో ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించింది.

ఆగస్టులో పన్నుల ద్వారా రూ.13,146 కోట్లు వసూలు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికంగా నిలిచింది. జూన్‌లో రూ.12,190కోట్లు, జులైలో రూ.9,965 కోట్లు ఖజానాకు చేరాయి. గత నెల జులైతో పోలిస్తే ఆగస్టులో ఆదాయం 30శాతానికి పైగా పెరిగింది.

పన్ను ఆదాయంప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 5నెలల్లో పన్ను ఆదాయం రూ.57,772 కోట్లు కాగా బడ్జెట్ అంచనాతో పోలిస్తే 35శాతానికి పైగా ఉంది. ఆగస్టు వరకు జీఎస్టీ ద్వారా రూ.20,500కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,390కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.13,487 కోట్లు సమకూరాయి. ఆబ్కారీ శాఖ నుంచి రూ.7,806కోట్లు, కేంద్ర పన్నుల నుంచి రూ.6,220 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల ద్వారా రూ.3,316 కోట్లు సమకూరగా పన్నేతర ఆదాయం రూ.1,449 కోట్లు వచ్చింది.

రుణాలు..లోటుకేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇప్పటివరకు రూ.2,447 కోట్లు వచ్చాయి. బడ్జెట్లో అంచనా వేసిన రూ.21వేల కోట్లలో పోలిస్తే వచ్చిన మొత్తం 11శాతమే. బడ్జెట్ లో రూ.2,21,242 కోట్ల రెవెన్యూ అంచనా వేయగా 5నెలల్లో 28శాతం అంటే రూ.61,618కోట్లు ఖజానాకు జమ అయ్యాయి.

5నెలల్లో ప్రభుత్వం రూ.29,449 కోట్ల రుణాలు తీసుకోగా బడ్జెట్లో అంచనా వేసిన రూ.49,255 కోట్లతో పోలిస్తే ఇది 60శాతంగా ఉంది.

ఆగస్టు నెలవరకు ప్రభుత్వం రూ.85,467కోట్లు ఖర్చు చేసింది. ఆగస్టు నెల ముగిసే వరకు రూ.15,521 కోట్ల రెవెన్యూ లోటు రూ.29,449 కోట్ల ఆర్థికలోటు రూ.18,952 కోట్లు ప్రాథమిక లోటుగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement