Thursday, March 28, 2024

Telangana: నిండిన సరళాసాగర్.. తెరుచుకున్న ఆటోమేటిక్ సైఫన్లు

మదనాపురం, (ప్రభ న్యూస్) : వ‌న‌ప‌ర్తి జిల్లాలోని మదనాపురం మండల శంకరమ్మపేట వద్ద ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు సరసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి వరద ఉధృతంగా రావడంతో ప్రాజెక్టులోకి నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో ఆటోమేటిక్ సైఫన్లు శనివారం సాయంత్రం 5 గంటలకు రెండు ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి. వీటిలో రెండు ఉడ్ సైఫాన్లు, ఒక‌టి ప్రేమింగ్ సైఫన్ ఓపెన్ కావడంతో వీటి ద్వారా 2000 క్యూసెక్కుల నీరు ఊక చెట్టు వాగు ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టులోకి చేరుకుంటోంది.

సరళ సాగర్ ప్రాజెక్ట్ సైఫన్లు తెరుచుకోవడంతోమదనాపురం, ఆత్మకూర్ గ్రామాల మధ్య ఊక చెట్టు వాగు వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఆత్మకూరు, దుప్పల్లి, కొత్తపల్లి, కోన్నూరు, నెలివిడికి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం క‌లిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మదనపురం ఎస్సై మంజునాథ్ రెడ్డి, ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement