Tuesday, March 26, 2024

పెళ్లి మండ‌పంలోనే కుప్ప‌కూలిన వ‌ధువు తండ్రి.. ఇరు కుటుంబాల్లో విషాదం

వరంగల్ క్రైమ్ : వరంగల్ నగరంలోని వేణురావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాళ్లు కడిగి కన్యాదానం చేసి కూతురు, అల్లుడికి అరుంధతి నక్షత్రం చూపెట్టిన మామ‌.. ఆ త‌ర్వాత‌ గుండెపోటుతో చ‌నిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఇవ్వాల వ‌రంగ‌ల్‌లో జ‌రిగింది.

బొరిగం వెంకటరామ్ నర్సయ్య పద్మశాలి కళ్యాణ మండపంలో తన కూతురు హారిక పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాడు. కూతురు పెళ్లి అయ్యాక కొద్ది గంటల్లోనే అదే కల్యాణ మండపంలో గుండెపోటుతో చ‌నిపోవడంతో పెళ్లి ప్ర‌దేశం అంతా ఏడుపులు, పెడ‌బొబ్బ‌ల‌తో మారుమోగింది. సంతోషంగా గ‌డ‌పాల్సిన ఇరు కుటుంబాల్లో విషాదం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement