Wednesday, April 24, 2024

రోడ్డెక్కిన రైతులు.. మెదక్ లో రాస్తారోకో

మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రాస్తారోకో నిర్వహించారు.  దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలించడం లేదంటూ రైతుల ఆందోళన నిర్వహించారు. రైస్ మిల్లు యజమానులు స్థానికేతరుల ధాన్యాన్ని కోలుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతి ధర్మారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యంలో మొత్తం 25% ధాన్యం కూడా రైస్ మిల్లులకు తరలించలేదన్నారు. ఎన్నిమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా లారీలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement