Tuesday, December 3, 2024

Farmers Festival: నేడు రైతన్నలకు శుభవార్త చెప్పనున్న రేవంత్

హైదరాబాద్ – మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా నేడు హాజరుకానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి . ఈ సదస్సులో రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

ఈ ఏడాది రెండో పంట సీజన్‌ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ ఏడాది రెండో పంటకాలం నుంచి ఎకరానికి రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కూడా మహబూబ్‌నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది.

దీంతోపాటు రైతు రుణమాఫీ పథకం కింద రూ.2 లక్షల వరకు బకాయిలున్న రైతులకు కూడా సీఎం రేవంత్ ఇవాళ శుభవార్త చెబుతారని అన్నదాతల్లో ఆశలు నెలకొంది.

- Advertisement -

ఇక నేడు జరిగే రేవంత్ బహిరంగ సభకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైతు పండగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ రీజియన్ నుంచి 657 బస్సులను ఆర్టీసీ కేటాయించింది. బహిరంగ సభకు సుమారు లక్ష మంది వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. 2 వేల మందితో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement