Wednesday, October 4, 2023

న‌కిలీ నోట్ల ముఠా అరెస్ట్ ..

హైద‌రాబాద్ – నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏపీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని పట్టుకున్నాం. ఈ ముఠా నకిలీ కరెన్సీ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నారు. రూ. 50, 100, 200, 500 నోట్లు ప్రింట్ చేశారు. రూరల్ ఏరియాస్ లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేశారు. రాత్రి వేళల్లో రద్దీగా ఉండే షాపుల్లో కూడా నోట్లను మార్చుతున్నారు’అని పేర్కొన్నారు. ఇక ప్రింట్‌ చేసిన దొంగ నోట్లను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ముఠా తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దిరిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రస్తుతం వారి నుంచి సమాచారం రాబడుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement