Tuesday, March 26, 2024

ఎగ్జిట్ పోల్స్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు!

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ లోని తిరుపతి తెలంగాణలోని నాగార్జునసాగర్ కు ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి. ఫలితాలపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ఆరా సంస్థ వెల్లడించింది. ఈ ఎన్నికలో అత్యధికంగా వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా అంచనా వేసింది. అదే సమయంలో టీడీపీకి 23.10 శాతం, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇక తెలంగాణలోని సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను ‘ఆరా’ సంస్థ వెల్లడించింది. అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోమారు పట్టం కట్టినట్టు ‘ఆరా’ తన అంచనాల్లో పేర్కొంది. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లో లో అధికార పార్టీలకే ప్రజల మద్దతు ఉన్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. సర్వేలు తమకు అనుకూలంగా రావడంతో అటు వైసీపీ ఇటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఉప ఎన్నిక ఫలితాలు మే 2న వెల్లడి కానున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement