Monday, December 9, 2024

MDK: 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి… అదనపు కలెక్టర్

నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రభ న్యూస్) : ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గానూ 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ, యువకులు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం నర్సాపూర్ పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయం నుంచి స్థానిక అల్లూరి సీతారామరాజు కళాశాల వరకు 5కే రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పాల్గొని 5కె రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు హక్కు అనేది మన జన్మ హక్కుగా భావించి ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని విద్యార్థులు, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కమలాద్రి, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement