Saturday, September 25, 2021

రేపు డిశ్చార్జి కానున్న ఈటల రాజేంధర్..

హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేంధర్..ఆనారోగ్యంతో అపోలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈటల రాజేంధర్ రేపు ఆస్పత్రి నుంచి డిచార్జ్ కానున్నారు. కాగా కాసేపటి క్రితమే ఈటలను ఎమ్మెల్యేలు రఘునందన్, రాజాసింగ్ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, రేపు డిశ్చార్జి అవుతారని రాజాసింగ్ చెప్పారు. ప్రజాదీవెన పాదయాత్రను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఏడోసారీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా నిన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ లు ఆయన్ను పరామర్శించారు.

ఇది కూడా చదవండి: హస్తినలోనే అమీతుమీ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు ఉధృతం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News