Saturday, June 3, 2023

రాష్ట్రం వచ్చాకే తెలంగాణలో ప్రగతి పరుగులు – మంత్రి ఎర్రబెల్లి..

జీ కే తండా, మడిపల్లి (తొర్రూరు – పాలకుర్తి నియోజకవర్గం), మార్చి 28: ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాకే తెలంగాణలో ప్రగతి పరుగులు పెడుతుందని, సీఎం కెసిఆర్ మార్గనిర్దేశం తో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వినూత్న పథకాలతో విశిష్ట ప్రగతి ని సాధించి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని జీ కే తండాలో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతిథిగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని తిమ్మాపురం ఖానాపురం కంఠాయపల్లి మడిపల్లె, జీకే తండా గ్రామాల కు కలిపి జీకే తండాలో, మడిపల్లి, కంటాయ పాలెం, సోమారపు కుంట తండా గ్రామాలను కలిపి మడిపల్లి లో నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన0లో ఆయా గ్రామాల బి అర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement