Thursday, November 7, 2024

Encroachment – నాగార్జునపై కేసు న‌మోదు

త‌మ్మిడి కుంట చెరువు క‌బ్జాపై ఫిర్యాదు
అందులోనే ఎన్ క‌న్వేన్ష‌న్ నిర్మాణం…
ఇటీవ‌లే హైడ్రా కూల్చివేత
లీగ‌ల్ ఓపినియ‌న్ త‌ర్వాత కేసు న‌మోదు చేసిన పోలీసులు

హైద‌రాబాద్ – సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కు పంపించిన మాదాపూర్ పోలీసులు తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున కట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. మరోవైపు, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు వేశారు. ఈ నేపథ్యంలో, నాగార్జునపై కేసు నమోదు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement