Thursday, March 28, 2024

కామారెడ్డి జిల్లాలో గుండెపోటు టెన్ష‌న్ – వారం రోజులు తొమ్మిది మంది మృతి

కామారెడ్డి ప్రభన్యూస్. కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వారం రోజుల్లో 9 మంది చనిపోయారు. కామారెడ్డి జిల్లాలో గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. పోయిన వారిలో చాలామంది యువకులు కావడంతో వారి కుటుంబాలు అనాధలు కావడం తీవ్రంగా కలిచి వేస్తుంది. మరణించిన వారిలో 25 నుండి 40 ఏళ్ల లోపు వారు కావడం వారంలో 9 మంది చనిపోవడం అంతు పట్టడం లేదు. మరణించిన వారి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. కుటుంబ సభ్యులు అనాధలవుతున్నారు. 9 మంది మృతికి గుండెపోటు కారణం కావడం అందరినీ కలవరపెడుతుంది. 9 మంది గుండెపోటు చనిపోవడంతో వారి కుటుంబాలలో ప్రజలలో కలవరం పెరుగుతుంది. హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించడం గురిచేస్తుంది. వారం రోజులు ఎనిమిది మంది చనిపోవడం అందరి మృతికి కారణాలు గుండెపోటు కావడం ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రజలు కలవరం చెందుతున్నారు. ప్రభుత్వాలు, నిపుణులు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు లోతుగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలను చైతన్యం చేయాలని, అప్రమత్తత చర్యలు తీసుకురావాలని కోరుతున్నారు.

మరణించిన వారి వివరాలు
కామారెడ్డి పట్టణంలోని గోనె సంతోష్ 32 సంవత్సరాలు ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ హఠాత్తుగా బుధవారం నాడు గుండెపోటుతో చనిపోయారు. గాంధారి మండల పరిధిలోని నౌసిలాల్ తాన్డా కు చెందిన సజ్జన్లాల్ 35 సంవత్సరాలు గుండెపోటుతో చనిపోయారు. బుధవారం రాత్రి చనిపోయారు. మంగళవారం నాడు ఏడో తేదీన బీబీపేట మండల కేంద్రం చెందిన మజార్ 30 సంవత్సరాలు ఆటో నడుపుతూ గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన మజారిది స్వగ్రామం బిబిపేట కాగా కామారెడ్డి లో ఆటో నడుపుతూ నివసిస్తున్నారు. వారం క్రితం జిల్లా కేంద్రంలోని దేవుని పల్లికి చెందిన అహ్మదుల్లా గుండెపోటుతో మృతి చెందారు. అహ్మదుల్లా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడుగా పనిచేస్తున్నారు. గాంధారి మండల కేంద్రం చెందిన షేక్ అహ్మద్ 30 సంవత్సరాలు మార్చి ఆరో తేదీన గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మాచారెడ్డి తండా కు చెందిన 40 సంవత్సరాల గిరిజన వ్యక్తి రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడని బంధువులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ గుండెపోటుతో చనిపోయారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 4 0 ఏళ్ల మహమ్మద్ మోమిన్ మస్కట్లో గుండెపోటుతో చనిపోయారని బంధువులు తెలిపారు. తాజాగా బుధవారం నాడు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గోనె శ్రీనివాస్ తమ్ముడు గోనె సంతోష్ ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుతో చనిపోయాడు. వారం రోజుల్లో కామారెడ్డి వాసులు ఎనిమిది మంది గుండెపోటుతో చనిపోవడం కలవరం రేగుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement