Sunday, May 29, 2022

సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే వివేకానంద్

కుత్భుల్లాపూర్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వివేకానంద్ ను కలిసేందుకు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే నివాసానికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే తన వద్దకు వచ్చిన వారి సమస్యలను తెలుసుకుంటూ వెను వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement