Thursday, April 25, 2024

రాజ‌కీయ కుట్రే – డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: కవిత.. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ అని మరోసారి అనిపించుకుంది. 11గంటల విచారణ తర్వాత కూడా.. చెదరని చిరునవ్వుతో బయటకు వచ్చిన కవిత విచారణ సందర్భంగా అధికారులే నీళ్ళునమిలే ప్రశ్నలను సూటిగా సంధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈడీ అధికారులను కవిత ముక్కుసూటిగా ప్రశ్నించింది. పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ సహాయ నిరాకరణగా చిత్రీకరించే కుట్ర ఈడీ అధికారులు చేస్తున్నారని మండిపడింది. సోమవారం ఢిల్లిలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన కవిత రాజకీయ కుట్రతోనే తనను వేధిస్తున్నారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు
ఎవ్వరితో కూడా అధికారులు కన్‌ఫ్రంట్‌ చేయలేదు. ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా చూపెట్టలేకపోయినా ఈడీ, ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారిస్తున్నారని స్పష్టం చేసింది. ఇది కేవలం రాజకీయ కుట్ర అని విచారణ సందర్భంగా కవిత కుండబద్దలు కొట్టింది. రాజకీయ ఒత్తిడితో ఈడీ పారదర్శకత లోపించిందని ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు ఈడీ డైరెక్టర్‌ నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. కేవలం పొలిటికల్‌ లైన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అధికారులు ప్రశ్నించగా, తనను నిందితురాలుగా పిలిచారా? అని ఈడీ ఆఫీసర్లను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించింది. దీంతో కాదు అని అధికారులు నీళ్లు నమిలినట్లు తెలిసింది.

తొందరెందుకు?
విచారణకు పిలిచి ఎలాంటి కాన్‌ఫ్రంటేషన్‌ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో అధికారులు విచారణ చేశారని కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాను విచారణకు సంపూర్ణంగా స#హకరిస్తున్నానని కవిత ఈ సందర్భంగా బలంగా చెప్పింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్‌ పూర్తిగా చెక్‌ చేసుకోవచ్చని అధికారులకు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసింది. తను ఫోను ధ్వంసం చేసినట్టు మీడియాకి లీకులు ఎవరు చెప్పారని ఈడీ అధికారులను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించగా, అధికారులు ఖంగుతిన్నట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించినట్లు తెలిసింది. బీజేపీలో చేరాక మరుగున పడ్డ హేమంత్‌ బిశ్వ శర్మ, సుజనా చౌదరి, నారాయణ రాణ కేసులను ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట వరకు అధికారులు రాకపోగా, గంటలపాటు రూమ్‌లో ఒకరిని కూర్చోబెట్టి మానసికంగా పరీక్షపెట్టినట్లు సమాచారం. మొత్తం 11గంటల విచారణలో కవితను 14 ప్రశ్నలు అధికారులు అడిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement