Sunday, March 24, 2024

తెలంగాణ‌కు కేంద్రం ఆర్థిక సంకెళ్లు…

హైదరాబాద్‌, : అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణకు కేంద్ర నిబంధనలు ప్రతికూలంగా మారాయి. కరోనా విపత్తుతో ఆర్ధికంగా చితికిపోతున్న తెలంగాణను ఆదుకొ వడంలో కేంద్రం తాత్సారం చూపిస్తోంది. కనీసం 15వ ఆర్ధిక సంఘం నిబంధనలను సవరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తులనూ సానుకూలంగా పట్టించుకోవడం లేదు.సంక్షోభ సమయం లోనూ తెలంగాణ ధాన్యం కొనుగోళ్లు చేస్తూ, రైతాంగానికి రూ. 35వేల కోట్ల చెల్లింపులతో ఎఫ్‌సిఐకి అండగా నిలబడుతున్నది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి సాయం పొందడంలేదని నిపుణులు ఉదాహరణలు చూపుతున్నారు. కేంద్ర వివక్షాపూరిత తీరు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోంది. 2014నుంచి 2019వరకు దక్షిణాది రాష్ట్రాలనుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన ప్రతీ రూపాయిలో తిరిగి కేంద్రం కేవలం 52 పైసలే తిరిగి వస్తుండగా, అదేసమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం కేంద్రానికి వచ్చే రూపాయికి బదులుగా రూ. 3.25లను ఇవ్వడం సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా మారింది. 15వ ఆర్ధిక సంఘం సూచించినట్లుగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 42నుండి 41 శాతం తగ్గించగా…అదేస్థాయిలో ఇతర పన్నుల్లో వాటాను కూడా భారీగా తగ్గడంతో మొత్తం కేంద్ర సాయం పద్దు తగ్గుతూ వస్తోంది. కేంద్ర సాయంలో మొత్తంగా 4 శాతంమేర తగ్గుదలతో 48శాతానికే పరిమితమైంది. జాతీయోత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 2019-20లో 85.95శాతంగా నమోదు కాగా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఈ రాష్ట్రాలకు 20నుంచి 25 శాతమే దక్కుతున్నాయి. పన్నుల వాటా నిర్దేశించేందుకు 2011 జనాభా ఆధారంగా తీసుకోవాలన్న 15వ ఆర్ధిక సంఘం నిర్ణయంతో జనాభాను నియంత్రిస్తున్న తెలంగా ణను దెబ్బతీసింది. జాతీయస్థాయిలో సంతాన వృద్ధి శాతం 2.33 కాగా, తెలంగాణలో ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యత్తమ విధానాల కారణంగా ఇది 1.8శాతంగా ఉంది. దీంతో కేంద్ర పన్నుల వాటా పెంచడానికి ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలు ఆటంకంగా మారాయి. ఇక కేంద్రం నిర్ధేశించిన ఆర్ధిక సంస్కరణల వేగం, ఉపాధి అవకాశాల పెంపుదల, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి అన్నింట్లో తెలంగాణ ముందంజలో ఉంది. తెలంగాణనుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ. 50వేల కోట్లకుపైగా రాబడి వెళుతోంది. రాష్ట్రంనుంచి కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో తిరిగి రాష్ట్రానికి చేరుతున్న పన్నుల వాటా సగమేనని, 15వ ఆర్ధిక సంఘం నిర్ధేశించిన 41 శాతం వాటా నిధుల్లోనూ పురోగతి మందగి స్తోంది. 2016-17, 2017-18,2019-20లలో ఒక్కో ఆర్ధిక యేడాది కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 50వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరింది. ఆదాయపు పన్ను, సేవా పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్స్‌ డ్యూటీ వంటి పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రంనుంచి పన్నులు చేరుతున్నాయి. అయితే కేంద్రంనుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో వస్తున్న పన్నుల వాటా, కేంద్ర సాయం, ప్రాయోజిత పథకాలు అన్నీ కలుపుకుని రూ. 29వేలకు మించడంలేదు. కేటాయింపులతో పొంతన లేకుండా ఆర్ధిక యేడాది ముగింపునాటికి 70శాతం కూడా మించడంలేదు. ఇక సీఎస్‌ఎస్‌(కేంద్ర పథకాలకు రూ. 3నుంచి రూ. 4వేల కోట్లు అంచనా వేసుకోగా ఏ ఒక్క ఏడాదికూడా రూ. 1000 కోట్లు మించలేదు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు 80శాతంపైగా నిధులను కేటాయించడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు పెరిగాయి.
15వ ఆర్ధిక సంఘం సూచీల్లో టాప్‌
15వ ఆర్ధిక సంఘం కేంద్ర నిధుల కేటాయింపునకు సూచీలు గా నిర్దేశించిన పనితీరు, ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల అమలు, జనాభా నియంత్రణ, ఇతర అంశాల్లో రాష్ట్రం పురోగతిలో ఉంది. ఇందుకు అనువుగా కేంద్ర కేటాయింపులు పెరగాల్సి ఉండగా తగ్గుతూ పోతోంది. గడచిన 14వ ఆర్ధిక సంఘం 5ఏళ్లలో లక్ష కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. పన్నుల ద్వారా రూ. 96,217కోట్లు స్థానిక గ్రాంట్‌లు రూ. 9449 కోట్లుగా అంచనా వేసింది. అది అమలుకాకపోగా, తాజాగా వచ్చే ఐదేళ్లకు నిధులనిచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్న 15వ ఆర్ధిక సంఘం మధ్యంతర నివేదికలో తెలంగాణ వాటాను 42శాతంనుంచి 41శాతానికి కుదిం చింది. జనాభా నియంత్రణ, జలవనరుల సంరక్షణ, డిజిటల్‌ లావాదేవీలు, గ్రామీణ ఆర్ధిక వనరుల బలోపేతం వంటివి తెలంగాణ ప్రగతితో అనుకూలంగా ఉన్నాయని తేలినా కేంద్రం పట్టించుకోలేదు. జనాభా తక్కువగా ఉండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 115వ ఆర్ధిక సంఘం వెయిటేజీని తగ్గించడంతో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లలో తక్కువ మొత్తం ఇస్తూ వస్తోంది. 2019-20లో రూ. 18,964కోట్లుగా ఉన్న రాబడి రూ. 16,241కోట్లకు తగ్గింది. . 14వ ఆర్ధిక సంఘం నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం చేసిందని, తాజా 15వ ఆర్ధిక సంఘా నికి అటువంటి అవకాశం ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాలు, సమగ్ర రాష్ట్ర వివరాలు, పరిస్థితులు, ప్రజల జీవన ప్రమా ణాలు వంటి వాటి ఆధారంగా నిధుల కేటాయింపు జరిగేలా నివేదికలను రూపొందిస్తోంది.
ఎన్నికల హామీల అమలుకు అడ్డంకి
అయితే 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు రాష్ట్రాల ఆర్ధిక స్వాతంత్య్రానికి ముప్పుగా పరిణమించాయనే ఆందోళన పెరుగుతోంది. సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా రాష్ట్రాలు తామిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా టర్మ్స్‌ అండ్‌ రిఫరెన్సెస్‌లో కొన్ని అంశాలు విరుద్దంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. జనాభా ప్రాతిపదికను మార్చడంతో ఆర్ధిక భారం, అదాయ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. గ్రాంట్లలో కోతకు ఇదే కారణ మవుతోందని ఆరోపిస్తోంది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేటాయింపులను మారుస్తున్నారనే అంశాన్ని ఎత్తిచూపింది. మరోవైపు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్ర పథకాల అమలుతో ముడిపెట్టడం పలు రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిం ది. నాన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాలు దీంతో భారీగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇదేవిధంగా జనాకర్షక పథకాలు (పాపులిస్టిక్‌ స్కీమ్స్‌) పెంచితే కోత పెడతామని ఉన్న నిబంధన కూడా తెలంగాణ పురోభివృద్ధికి అడ్డంకిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement