Sunday, May 9, 2021

ఈటల భూ క‌బ్జా నిజం – తేల్చేసిన మెద‌క్ క‌లెక్ట‌ర్…..

అచ్చంపేట – మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రైతుల‌ అసైన్డ్ భూముల క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిష్ చెప్పారు.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశాల‌తో రెవిన్యూ, విజిలెన్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నేటి ఉద‌యం అచ్చంపేట‌లో విచార‌ణ చేప‌ట్టారు. పిర్యాదు చేసిన రైతుల‌తో అధికారులు మాట్లాడారు… అలాగే గ్రామంలోని ప‌లువురు రైతుల‌ను విచారించారు… క్షేత్ర స్థాయిలో భూముల‌ను ప‌రిశీలించారు…ఈ సంద‌ర్భంగా అసైన్డ్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు గుర్తించారు.. ఇదే విష‌యాన్ని మెద‌క్ జిల్లా హ‌రీష్ మీడియాకు వెల్ల‌డించారు.. విచార‌ణ కొన‌సాగుతున్న‌ద‌ని అంటూ భూక‌బ్జా నిజ‌మ‌ని అన్నారు…ఎంత భూమి క‌బ్జాకు గురైంద‌నే విష‌యం ఆయా భూముల ప్రాంతంలో స‌ర్వే అనంత‌ర‌మే తేలుతుంద‌ని చెప్పారు.. బాధిత రైతులతో మాట్లాడి, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు అన్యాయానికి గురయ్యారని తెలిపారని చెప్పారు. తమ భూములు లాగేసుకున్నారని బాధిత రైతులు తమ వాపోతున్నారని వెల్లడించారు. పూర్తి స్థాయి విచార‌ణ అనంత‌రం అన్ని వివ‌రాల‌తో నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Prabha News