Saturday, January 4, 2025

Earthquake | మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు.. తీవ్రత 3.0గా నమోదు

తెలంగాణను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మూడు రోజుల కిందట కూడా తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంనపలు సంచలనం సృష్టించాయి. రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా తెలంగాణలోని హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏడు సెకండ్ల దాకా భూ ప్రకంపనలు వచ్చాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement