Monday, October 14, 2024

NZB: అప్పుల బాధతో.. రైలు కింద పడి ఆత్మహత్య…

నవీపేట్, సెప్టెంబర్ 21 ప్రభ న్యూస్ : నవీపేట్ మండలంలోని అభంగపట్నం గ్రామానికి చెందిన అల్లె వినోద్ కుమార్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు మెడికల్ ఫిట్నెస్ లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో అప్పులు ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇవాళ తెల్లవారుజామున నవీపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement