Wednesday, February 8, 2023

ఆగిన మెట్రో .. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది

హైదరాబాద్ మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజైల్ లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో ఈ ఘటన అసలు ఏం జరుగుతుందో అంటూ కంగారు పడ్డారు. త్వరగా వారి గమ్య స్థానానిక చేరుకునేందుకు మెట్రో ఎక్కితే ఇలాంటి లోపాలు మాటి మాటికి తెలెత్తడం ఏంటి అంటూ నిరాస చెందారు. అయితే మెట్రోలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించేందుకు సాయశక్తుల ప్రయాత్నించినా ఫలితం దక్కలేదు. మెట్రో రైలు కదలేందుకు ససేమిరా అనడంతో.. చేసేది ఏమీ లేక అధికారులు ప్రయాణికులను మెట్రో నుంచి దింపివేశారు .

సాంకేతిక లోపంలో మెట్రో ముందుకు కదలడం లేదని కావున ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా మరో మెట్రోను సిద్దం చేసినట్లు మైకుల్లో ప్రకటించారు. ప్రయానికులు అందరిని వేరే మ్రెటోలో మరో ట్రైన్ లో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement