Friday, April 26, 2024

వరిలో డ్రోన్‌ టెక్నాలజీ.. అగ్రి వర్సీటీని పరిశీలించిన నాబార్డు చైర్మన్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: వరిలో డ్రోన్‌ వినియోగంతో సమయం, ఖర్చు ఎంత వరకు ఆదా అవుతుందని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు అగ్రి యూనివర్శిటీ శాస్త్రవేత్తలను అడిగారు. ఈ మేరకు ఆయన ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ముం దుగా అగ్రిహబ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో, ఉప కుపలతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావుతో కలిసి సమావేశమయ్యారు. అనంతరం విశ్వ విద్యాలయ పరిధిలోని మిల్లెట్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌, ఏఆర్‌ఐ క్యాంపస్‌ లోని వరి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. వరి సెంటర్‌లో జరుగుతున్న పరి శోధనలను నాబార్డు చైర్మన్‌కు వి.సి ప్రవీణ్‌రావు వివరించారు. వరిసాగులో వివిధ దశల్లో డ్రోన్‌ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన వివరాలను పరి శోధనా స్థానం శాస్త్రవేత్తలు గోవిందరాజులుకు వివరించారు.

డ్రోన్‌ సహాయంతో పురుగు మందుల పిచికారి, వరి రకాల సాగు విస్తీర్ణం అంచనా వేయడం, తెలంగాణ సోనా సాగుకు సంబంధించిన వివరాలను శాస్ర ్తవేత్తలు వివరించారు. డ్రోన్‌ ద్వారా వరి వెదజల్లే పద్ధతి లైవ్‌ డెమాన్‌ స్ట్రేషన్‌ను ఆయన తిలకించారు. వరి పంటకు సంబంధించి విశ్వవిద్యాలయం అభివృద్ధి పరిచిన రకాలను, అభి వృద్ధిపర్చనున్న రకాల గురించి ఆసక్తిగా తెలుసు కున్నారు. డ్రోన్‌ ఆధారిత వ్యవ సాయ సేవల గురించి ప్రవీణ్‌రావు ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రాంత నాబార్డు సీజీఎం వై.కృష్ణా రావుతో పాటు పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement