Wednesday, March 27, 2024

Telangana: డౌరీ డెత్ కేసులో దోషికి మూడేళ్ల జైలు శిక్ష.. వెయ్యి రూపాయల జరిమానా

డౌరీ డెత్ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎం. నాగరాజు ఇవ్వాల (మంగళవారం) తీర్పు వెల్లడించారు. 2013లో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి లో వరకట్న వేధింపులతో దాసరి స్వప్న(25) ఆత్మహత్యకు పాల్పడింది.

బంధువుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దాసరి రమేష్ పై అప్పటి పెద్దపల్లి డి.ఎస్.పి వేణుగోపాలరావు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు సరైన సాక్షాధారాలు కోర్టుకు అందజేయడంతో జిల్లా సెషన్స్​ జడ్జి నాగరాజు నిందితుడు రమేష్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి రెడ్డి, సిడిఓ సంజయ్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్సై మహేందర్ ను పెద్దపల్లి డీసీపీ రూపేష్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement