Wednesday, April 24, 2024

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ఏడు ప్రధాన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జులై1 నుంచి 30 వరకు మొదటి విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించారు. జులై 6 నుంచి 30 వవరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 6న మొదటి విడత రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1080 డిగ్రీ కాలేజీలు ఉండగా దోస్త్‌ పరిధిలోనివి 962 ఉన్నాయి. మిగతా కాలేజీలు9 దోస్త్‌ పరిధిలో లేవు. ఈ కాలేజీల్లో మొత్తం 4,68,870 సీట్లు ఉన్నాయి. వీటిని మూడు విడతల్లో భర్తీ చేయనున్నారు. అయితే గతేడాది మాత్రం 2,55,021 సీట్లు భర్తీ అయ్యాయి.

ఆగస్టు 7 నుంచి 18 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు విద్యార్థులకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 7 నుంచి 21వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అదే నెల 7 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 28 ఆగస్టున సాయంత్రం రెండో విడుతకు సంబంధించిన సీట్లను కేటాయించను న్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు మూడో విడుత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇదే సమయంలో వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్‌ 16న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

ఏఐఎంఎల్‌ కొత్త కోర్సులు…

ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ స్థాయిలో నూతన కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రంలోని 11 అటానమస్‌ డిగ్రీ కాలేజీల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఎల్‌) కొత్త కోర్సులను ప్రవేశపెట్ట నున్నారు. ఒక్కో కాలేజీల్లో 60 సీట్ల చొప్పన మొత్తం 11 కాలేజీల్లో అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్‌ కాలేజీల్లోనూ నూతన కోర్సులను బోధించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement