Tuesday, December 10, 2024

KNR | భయం వద్దు.. ధైర్యంగా ఉండాలి.. రామగుండం సీపీ శ్రీనివాస్

మీ రక్షణ కోసమే మేమున్నాం..
రామగుండం, నవంబర్‌ 11 (ఆంధ్రప్రభ): మహిళలు, విద్యార్థినులకు ఎలాంటి భయం వద్దని.. ధైర్యంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. సోమవారం రామగుండం కమీషనరేట్‌ పోలీసు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్‌ సేప్టీ వింగ్‌ వారిచే రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ షీ టీ-మ్‌ విభాగానికి జారీ చేయబడిన టీ-జింగ్‌, ర్యాగింగ్‌, వర్క్‌ ప్లేస్‌ హరస్మెంట్‌, సోషల్‌ మీడియా హరస్మెంట్‌, తల్లితండ్రులు పిల్లలపై దృష్టి అవగాహన సంబంధించిన పోస్టర్లను రామగుండం పోలీస్‌ కమీషనర్‌ ఎం.శ్రీనివాస్‌ ఇతర అధికారులు, షీ టీ-మ్‌ సిబ్బంది తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఎవరైనా మిమ్మల్ని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, స్నాప్‌ చాట్‌, టెలిగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురిచేసినా, మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసినా, మీరు పని చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి నా వెంటనే షీటిమ్స్‌ వారిని సంప్రదించాలని సూచించారు. మీరు పని చేసే ప్రదేశాలలో స్వేచ్ఛగా, సురక్షితంగా పనిచేయడం ఒక మహిళ హక్కు అన్నారు. పిల్లల విద్యార్ధినిల యువతుల, మహిళల రక్షణ ప్రధాన లక్ష్యం అని మీరు ఎవరివలనైనా ఇబ్బందికి గురైతే భయపడవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు.

ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డయల్‌ 100, స్థానిక పోలీస్‌ అధికారులను, రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ షీ టీ-మ్స్‌ వాట్సాప్‌ 6303923700, ఫేస్‌బుక్‌, షీ టీమ్‌ రామగుండం ట్విట్టర్‌, షీటీమ్‌ ఆర్‌ఎండీ ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సంప్రదించాలన్నారు. మీ రక్షణ కోసమే మేమున్నామని అభయమిచ్చారు. అలాగే తల్లిదండ్రులు రోజు కాసేపు మీ పిల్లలతో మాట్లాడాలని, సరదాగా సమయం కేటాయించాలని, సమాజంలోని మంచి చెడుల గురించి అర్థమయ్యేలా వారికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సి. రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసిపి రాఘవేంద్రరావు, మంచిర్యాల జోన్‌ సిటీ ఇన్‌చార్జి ఎస్‌ఐ హైమ, పెద్దపెల్లి మంచిర్యాల జోన్‌ పరిధి షీ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement