Friday, May 20, 2022

జూన్‌ 2 నుంచి జిల్లా కోర్టు సేవలు : న్యాయమూర్తి భువనచంద్ర

పెద్దపల్లి, ప్రభ‌న్యూస్ : పెద్దపల్లి జిల్లా న్యాయస్థానం పూర్తి స్థాయి సేవలు జూన్‌ 2 నుంచి ప్రారంభమవుతాయని కరీంనగర్‌ ఉమ్మడి న్యాయమూర్తి భువనచంద్ర పేరొ్కన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కోర్టు భవనాన్ని పరిశీలించారు. కోర్టు ప్రాంగణంలో వసతులను పరిశీలించారు. న్యాయవాదులు, పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావెశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో జిల్లా కోర్టు మంజూరైందని, పూర్తిస్థాయిలో కోర్టు సేవలు ప్రారంభమైతే జిల్లా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

ప్రజలు, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు ఇకపై కరీంనగర్‌ కోర్టుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. న్యాయమూర్తి భువనచంద్రకు పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌తోపాటు పోలీస్‌ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సురేశ్‌ బాబు, ఉపాధ్యక్షులు అజయ్‌ క్రాంతి, మార కిశోర్‌, రమణారెడ్డి, తిరుపతిరావు, బాదం రమేశ్‌, సత్యనారాయణ, ఆసరి రమేశ్‌తోపాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement