Tuesday, December 3, 2024

Diksha Diwas – ఉద్యమ వీరుడు కేసీఆర్​పై కొత్త పాట – రిలీజ్​ చేసిన మాజీ ఎంపి జె.సంతోష్ కుమార్


ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: గ‌మ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడ‌మ్మో.. కొండంత బ‌ల‌గాన్ని ముందుడి న‌డిపిన‌ ఉద్య‌మ గుండెకు దండ‌లామ్మో.. అంటూ కొత్త‌గా విడుద‌ల‌పై పాట వినేవారికి, వీడియో చూసే వారికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఉద్య‌మ నేత‌, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పోరాటం తీరును ఆ వీడియోలో కండ్ల‌కు క‌ట్టేలా తీశారు. ఇక‌.. ఈ పాట‌ను మాట్ల తిరుప‌తి ఆల‌పించిన తీరు అద్భుతంగా ఉంద‌ని మాజీ ఎంపీ జె. సంతోష్‌కుమార్ అన్నారు. ఆ పాట‌ను ట్వీట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేప‌ట్లోనే వేలాది మంది లైక్ చేసి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

క‌ల‌ల జ్యోతిని ర‌గిలించింది..

కాగా, దీక్షాదివస్ సందర్భంగా మాట్ల తిరుపతి అద్భుతంగా ఆలపించిన ఆత్మీయమైన పాటను విడుదల చేసినందుకు, కేసీఆర్ అచంచలమైన ఆత్మ, త్యాగానికి హృదయపూర్వక నివాళి అని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంట్ వ్య‌వ‌స్థాప‌కుడు జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్‌ నిరాహార దీక్ష తెలంగాణ కలల జ్యోతిని వెలిగించి లక్షలాది మంది ఆశలను ఏకం చేసింద‌న్నారు. ఈ పాట చూసిన అంద‌రిలో భావోద్వేగాన్ని మ‌రోసారి ర‌గిలించింద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement