Friday, April 19, 2024

కలలోనైనా అనుకున్నారా 24 గంటలు కరెంట్ వస్తుందని.. మంత్రి హ‌రీశ్ రావు

కలలోనైనా అనుకున్నారా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దూకుతాయని అన్నారు మంత్రి హ‌రీశ్ రావు. నంగునూరు BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆయ‌న మాట్లాడుతూ..క‌లలోనైనా అనుకున్నారా 24 గంటలు కరెంట్ వస్తుందని కలలోనైనా అనుకున్నామా కళ్యాణ లక్ష్మితో లక్షరూపాయలు వస్తాయని.. మా రైతుబంధు, రైతుభీమా పథకాలు వస్తాయని అనుకున్నామా… మా కాళేశ్వరం కట్టుకొని కోటి ఎకరాల మాగాణిగా మార్చుకుంటామని…అనుకున్నామా ..కలలోనైనా అనుకోని పనులు చేసిన గొప్ప మనిషి మన సీఎం కేసీఆర్ సార్ అన్నారు హ‌రీశ్ రావు.తెలంగాణలో ఇన్నీ అసాధ్యాలు సుసాధ్యం అయ్యాయంటే మనకి అల్లాఉద్ధీన్ దీపం లేదు.. తెలంగాణకు సీఎం కేసీఆర్ అనే మహా దీపం అండగా ఉంది కాబట్టి అందరం చల్లగా ఉన్నాం..బీజేపీ ఆదానీ ఆమ్ దానీ పెంచుతుంటే కేసీఆర్ తెలంగాణ రైతుల ఆమ్ దానీ పెంచుతున్నార‌న్నారు మంత్రి.BRS అంటే బీదల పార్టీ..రైతుల పార్టీ -సామాన్య మధ్య తరగతి పార్టీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement