Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో ధోనీ అకాడమీ..

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన భారత క్రికెట్‌ దిగ్గజం ఎంఎస్‌.ధోనీ వెంచర్‌లోని ఎంఎస్‌డీసీఎ క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లో ధోనీ అకాడమీ ప్రారంభిచడంపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన ఎంఎస్‌డీసీఎ అకాడమీ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఎస్‌డీసీఎ-ఆర్కా ఎండీ మిహిర్‌ దివాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో ఎంఎస్‌డీసీఎతో రెండేళ్ల ఒప్పంద పత్రాలను ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్‌ మల్కా కొమరయ్య, మిహిర్‌ దివాకర్‌ మార్చుకున్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎంఎస్‌డీసీఎ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కొమరయ్యను ప్రత్యేకంగా అభినందించారు.

అకాడమీ ద్వారా భవిష్యత్‌లో ధోనీవంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని కోరారు. క్రికెటర్‌ కావాలనే ఆశయం ఉన్న చిన్నారులు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఎంఎస్‌డీసీఎతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తొలిదశలో ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌ నాచారంలో ఈ నెలాఖరు నుంచి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్కా యశస్వి, ఎంఎస్‌డీసీఎ ప్రతినిధులు సికిందర్‌, ఉమాశంకర్‌, రాబిన్‌, కోచ్‌లు సత్రజిత్‌ లహరి, వెంకట్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement